How to transfer money from credit card to bank account with less charges


తక్కువ ఛార్జీలతో క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేయాలి ???

హాయ్ ఫ్రెండ్స్ 
మీ అత్యవసర సమయం లో మీ అవసరాలకు మీకు కొంత డబ్బు  అవసరం కావచ్చు అవి ఇంటి అద్దె కావచ్చు, మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కావచ్చు,దానిని సకాలంలో చెల్లించక పోతే మీకు ఫైనాన్స్ ఛార్జీలు పడుతాయి దాని వలన సిబిల్ స్కోరు మీద  ప్రభావం పడుతుంది కాబట్టి బిల్లు ఆన టైమ్ లో పే చెయ్యాలి, అకస్మాత్తుగా ప్రయాణించవచ్చు లేదా మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు.

ఈ పరిస్థితులలో మీరు అధిక వడ్డీ కైన  ఫైనాన్షియర్ నుండి రుణం తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు, లేదా పిఎల్ లోన్ సమయం పడుతుందని మరియు ఇతర మొబైల్ వాలెట్లు (క్రెడిట్ బీ,kissht loan ధని లోన్ వంటి అదనపు ఆర్థిక సంస్థలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయి)


నా సలహా ఏంటి అంటే పైన చెప్పిన విధంగా  డబ్బు  ఋణం గా తీసుకుంటే భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తాయి, ఎలా అంటే  అదనపు ఫీజులు రూపంలో వసూలు చేస్తాయి.

కాబట్టి ఫ్రెండ్స్ లేట్  చేయకుండా  ఆ మొబైల్ వాలెట్ ద్వారా క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేయాలి అది కూడా చాలా తక్కువ ఛార్జీలు తో  మరియు ఆ వాలెట్  ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి సేఫ్ గా  బదిలీ చేసుకోండి 

ఆదే T  వాలెట్

 T  వాలెట్ గూర్చి ముఖ్యమైన విషయాలు
1. T వాలెట్ లో  రిజిస్టర్ చేసుకొవడానికి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు కి లింకై ఉండాలి.
2.మీడియం కేవైసి సెలక్ట్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
3.మీడియం కేవైసి తో నెలకి  15000/- రూపాయలు మీ బ్యాంకు ఖాతాకు క్రెడిట్ కార్డు నుండి  డబ్బు బదిలీ  చేసుకోవచ్చు.
3.మీడియం కేవైసి తో రోజుకు 5000/-వరకూ  క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేసుకోవచ్చు 
4.ఇక ఛార్జీలు చూస్తే  5000/- కి ఫీజు 17 రూపాయలు మరియు 18% జి.స్.టి అంటే  20/- ఐ. మ్. పి. స్ ఛార్జీలు .
5.క్రెడిట్ కార్డు నుండి లోడ్ చేసిన డబ్బు T వాలెట్ నుండి ఐ. మ్. పి. స్  ద్వారా బదిలీ అవుతాయీ.
6.క్రెడిట్ కార్డు నుండి 5000/- లోడ్ చేస్తే మీ క్రెడిట్ కార్డు నుండి 5059.11/- డెబిట్ అవుతుంది
,మీ T వాలెట్ లో 5000/- జమ అవుతాయీ.
7.రోజూకు రెండు సార్లు లోడ్ చేసుకోవడానికి మరియు రెండు సార్లు మీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ  చేసుకోవచ్చు.

ఇలా చేయడం ద్వారా మీకు నెల రోజుల వ్యవధి దొరుకుతుంది డబ్బు తిరిగి పే చేయడానికి ,ఇంకా ఎలాంటి అదనపు భారం పడకుండా ఉంటుంది,అలానే మీ  అత్యవసర అవసరం కూడా తీరుతుంది.


T వాలెట్   రెండు ఈ క్రింది ఆపరేటింగ్ సిస్టమ్ లో  లభ్యం అవుతుంది.




మీకు ఈ ఆర్టికల్  నచ్చింది అనుకుంటునా ఫ్రెండ్స్



ధన్యవాదాలు తెలుపుతూ మీ 
పాకాల మనోహర్  
డబ్బు కు సంబంధించిన అన్ని విషయాలను తెలుగులో చెప్తాను. 







Comments

Post a Comment

Popular posts from this blog

Welcome to PM Consultancy Services

You Need to Pay Big Money to Hospital Even though You have Health Insurance Coverage If You miss these 3 options

How to Understand Health Insurance Jargon in Simple Telugu